జవహర్‌లాల్ నెహ్రూ 1889-1940

చాచా నెహ్రూ

శ్రీ జవహర్‌లాల్ నెహ్రూ గారు 1889, నవంబర్ 14 వ తేదీన ఉత్తర భారతదేశంలోని అలహాబాద్ నగరంలో జన్మించారు. ఆయనను అందరూ ఆప్యాయంగా చాచా నెహ్రూ అని పిలుస్తారు మరియు అతని పుట్టినరోజును భారతదేశంలో బాలల దినోత్సవంగా జరుపుకుంటారు. ఆయనను ఆధునిక రిపబ్లిక్ ఆఫ్ ఇండియా యొక్క నిర్మాతగా ప్రశంసించబడతారు. నెహ్రూను పండిట్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఆయన పూర్వీకులు పండిట్ (పూజారి) వర్గానికి చెందినవారు. ఆయనను జవహర్‌లాల్ నెహ్రూ ది గ్రేట్ (మహావ్యక్తి/మహానుభావుడు) అని పిలవాలని నేను అభిలషిస్తాను.

భారత దేశ రాజ్యాంగ నిర్మాత

ఆయన ఎన్నో పుస్తకాలు రచించారు. ఆయన 1934 లో “గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ” (Glimpses of World History)  అను పుస్తకమును వ్రాసారు, 1936 లో “స్వేచ్ఛ వైపు పయనం” (Towards Freedom) అను ఆత్మ కథను ప్రచురించారు. మరియు ఆయన 1919 లో ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ (Discovery of India) అను పుస్తకమును ను ప్రచురించారు. 1938 నాటికే, ఆయన మున్ముందు భారత రాజ్యాంగం ఏవిధంగా ఏ ఏ అంశాలతో కూడి ఉండాలో వివరిస్తూ ముసాయిదా తయారుచేశారు. రాజ్యాంగంలో ప్రజలకు ప్రాథమిక హక్కులు కల్పించాలని, భారత ప్రభుత్వం  ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఏర్పాటు జరగాలని ఆ ముసాయిదాలో వివరించారు. కాంగ్రేసు పార్టి సదరు సూచనలను 1939 లో ఆమోదిస్తూ తీర్మానాలు చేసింది.

Book “ప్రాచీన భారతీయులకు అక్షర సుమాంజలి (వేద కాల సమాజము)”
Book “ప్రాచీన భారతీయులకు అక్షర సుమాంజలి (వేద కాల సమాజము)”

నా ఈ పుస్తకమును చదువదలచిన వారు నా సెల్ ఫోన్ నంబర్ 9866357268 కు Phone Pay ఫోన్ పె ద్వారా రు. 450/- పంపించి పోస్టల్ అడ్రసు తెలియ జేస్తూ వాట్మెసాప్ మెసేజ్ పెడితే పోస్ట్ ద్వారా పుస్తకము పంపబడును.

లేదా

పుస్తకమును Amazon అమెజాన్ ద్వారా కొనుగోలు చేయుటకు ఈ లింకు పై క్లిక్ చెయ్యండి. https://www.amazon.in/dp/B0CTSP19X3?ref=myi_title_dp అమెజాన్ ద్వారా వెల రు. 450/-

ప్రజలకు నెహ్రు పట్ల విశేష గౌరవం ఉంటుంది. ఎందుకంటే అతను దూరదృష్టి గలవాడు. నిష్కపటి. తాను నమ్మిన సిద్ధాంతాలను ఎన్నడూ వీడిపోలేదు. ఎవరికీ భయపడలేదు. భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించాలనే ధృడ సంకల్పంతో ఎన్నో బాధలు, ఇక్కట్లు ఎదురయినా వెనుదిరగక అచంచల విశ్వాసంతో ముందుకు సాగి పోరాడారు. అక్కడితో సరిపెట్టుకోకుండా స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత సూతన భారతదేశానికి దిశానిర్దేశం చేసి మనకు ప్రజాస్వామ్య గణతంత్ర సార్వభౌమ రాజ్యాన్ని ప్రసాదించారు.  ఆ సమయంలో భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధిస్తుందని గాని ఒకవేళ బ్రిటిషువారిని పారద్రోలిన తరువాత భారత దేశం అనే ఒక దేశంగా మనుగడలోకి వస్తుందని గాని ఎవేరికి ఉహకందని విషయం. బ్రిటిషువారు వెళిపోతే మళ్ళి ముస్లిముల పాలన వస్తుందేమోనని ఒక భయం. అలాగే బ్రిటిషువారు బలహీనామైతే వేరే యూరోపియన్ దేశాలు ఇండియాను ఆక్రమిస్తాయేమోనని మరో భయం ప్రజాలను పీడిస్తూ ఉండేవి. అయితే నెహ్రు గారు భారతదేశం స్తాపించబడుతుందని బ్రిటిషువారిని గాంధేయ మార్గాన్ని అవలంభించి పారద్రోలవచ్చని  ధృడ విశ్వాసంతో పని చేశారు. ఆ సమయంలో భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉంది, ఇది కాకుండా రాజాలు మరియు నవాబుల పరిపాలనలో ఉండే రాజ్యాలు విరివిగా ఉండేవి.

బ్రిటిషు వారి చేతిలో గల మద్రాసు, బాంబే, కలకత్తా మొదలయిన ప్రసిడేన్సీ ప్రాంతాలు ఉండేవి.

నెహ్రూ గారి యొక్క జీవిత చరిత్రను భారత స్వాతంత్య్ర సంగ్రామం నుండి వేరుచేసి చూడలేము. మరియు నెహ్రూ గారి జీవితం స్వాతంత్ర్య పోరాటంతో ముడిపడి యుంది.  అందుచేత ముందుగా నెహ్రూ స్వాతంత్య్ర సంగ్రామంలోకి ప్రవేశించే సరికి భారతదేశంలో జరుగుతున్న స్వాతంత్ర్య పోరాటాల స్థితిగతుల గురించిన వివరాలు తెలుసుకుందాము.

నా వీడియోలను యుట్యుబ్ లో తిలకించండి

నా ఈ వ్యాసాలను కూడా చదవండి

సాయుధ తిరుగుబాట్లు

బ్రిటిష్ వారు భారతదేశంలోకి ప్రవేశించిన తరుణం నుంచికూడా వివిధ ప్రాంతాలలో చట్ట పరిధిలో నిరసనలు ప్రదర్శించడం ఆయుధ పోరాటాలు చెయ్యడం సామాన్యంగా జరుగుతూనే ఉండేది. స్వాతంత్ర్య పోరాటం ఒక నిరంతర ప్రక్రియగా కోనసాగుతూనే ఉంది. 1857 లో చేలరేగిన సిపాయిల విఫ్లవం ఉత్తర భారతదేశానికి పరిమితం అయి ఉంది. ఆసమయంలో జమిందారులు, రాజాలు, నవాబులు సాధారణంగా బ్రిటిషు వారికి సహకరించారు. మరి కొంతమంది రాజాలు బ్రిటీషువారికి వ్యతిరేకంగా పోరాడారు. బ్రిటిషువారు స్వయంగా భారతదేశ పరిపాలనను 1876 లో చేపట్టిన తరువాత మొట్టమొదటి తిరుగుబాటు జండాను పీష్వా వంశానికి చెందిన శ్రీ బల్గంగాధర్ తిలక్ ఎగురవేశారు. తరువాత  వినాయక్ దామోదర్ సావర్కర్ విదేశాలనుంచి సాయుధ తిరుగుబాటుకు పన్నాగాలు పన్నారు. బెంగాలులో రాష్ బిహారీ బోస్, అరబిందో ఘోష్ తదితరులు కూడా ఇలానే దేశం కోసం పనిచేశారు. అప్పట్లో పత్రికా స్వేచ్చ అమలులో ఉండేది. తిలక్  కేసరి అను పత్రికను మరాఠీ భాషలోను, మరియు మరాఠీ అను ఇంగ్లీషు ప్రత్రికను స్థాపించి ప్రజలను బ్రిటిషు వారికి వ్యతిరేకంగా పోరాడమని బోధించేవారు.  అందుకు ఆయనకు 1897 లో 18 నెలలు కారాగార శిక్ష విధించారు. తరువాత 1908 లో విప్హ్లావకారుల చర్యను సమర్ధిస్తూ పత్రికలో వ్యాసాలూ వ్రాసినందుకు దేశ ద్రోహ నేరం మోపి ఆరు సంవత్సరాలు జైలు శిక్ష వేశారు.  చివరికి 1914 లో జైలు నుండి బయటకు వచ్చారు.

ఈ మధ్యలో 1909 లో బ్రిటిషు వారిపై మరో  పెద్ద దాడి జరిగింది. కొంతమంది ఆంగ్లేయులు చంపబడ్డారు. వి. D. సావర్కర్ కు ఈ నేరాలకు సంబందముందనే నేరారోపణ తో ఆయనకు రెండు విడతల 50 సంవత్సరాల అనగా మొత్తంమీద 100 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. తరువాత రెండవ దాడి మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో అనగా 1912–17 లో జరిగింది. సైన్యం లో అంతర్గత విఫ్లవాన్ని ప్రేరేపించి స్వాతంత్ర్యాన్ని సాధించడం ఈ ప్లాను ముఖ్యోద్దేశం. అయితే గూఢచారుల సహకారంతో బ్రిటిషు వారు ఈ విఫ్లవాన్ని భగ్నం చెయ్యగలిగారు. దాని తరువాత చివరి మరియు మూడవ సాయుధ పోరాటానికి సుభాష్ చంద్రబోస్ (1942–44) నాయకత్వం లో జరిగింది. ఆయనకు ముందు  రాష్ బిహారీ బోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించి బ్రిటిషు వారిపై యుద్ధానికి సన్నద్ధమవుతున్నాడు.  ఆ సమయంలో అనగా రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో కొంతమంది భారతీయ సైనికులను జపాన్ అదుపులోకి తీసుకుని ఉంది. ఆ యుద్ధ ఖైదీలను జపాన్ ఆజాద్ హింద్ ఫౌజ్ తో కలిపివేసి షుభాస్ చంద్రబోస్ కు ఆధిపత్యాన్ని ఇచ్చింది.  జపాన్ సైనికులతో కలిసి శుభాష్ బోస్ కొహిమా వరకు పయనించి వచ్చారు. అనగా మధ్యలో రంగూన్ ను జయించారు. కానీ ఇలాంటి ప్రయత్నాలన్నీ రెండు కారణాల వల్ల విఫలమవుతూ వచ్చాయి అని నేను భావిస్తున్నాను.

ఒకటి ఈ సాయధ విప్హ్లావకారులు వారికి కావాలని ధన సహాయము కొఱకు,  ఆయుధాల సరఫరా కోసం, వారికి రక్షణ కల్పించడానికి మరియు ప్రాపగాండా కొఱకు విదేశాలపై ఆధారపడి పని చేసేవారు. ఈ విదేశీ రాజ్యాలను బ్రిటిష్ వారు ఓడించినపుడు లేదా బ్రిటిష్ వారితో సదరు రాజ్యాల వారు స్నేహ పూర్వక ఒప్పందాలు చేసుకున్నపుడు వీరికి సహాయ సహకారాలు నిలిచిపోయేవి. అలా వీరి స్వాతంత్ర్య పోరాటానికి విఘాతాలు ఏర్పడేవి. ఉదాహరణకు, ఫ్రాన్స్ సావర్కర్‌ను 1908 లో బ్రిటిష్ వారికి ఒప్పగించివేసింది.

తరువాత రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓడిపోయినప్పుడు ఆజాద్ హింద్ ఫౌజ్ (Indian National Army) కూడా ఓడిపోయి విచ్ఛిన్నమైంది. మరియు చాలావరకు, ఈ సాయుధ స్వాతంత్ర్య సమరయోధులను జైలులో పెట్టేసేవారు. వివిధ చిత్ర హింసలకు గురిచేసేవారు. లేదా ఉరితీసేసే వారు. ఈ సాయుధ పోరాటాల యొక్క మరొక విశేశాంశం ఏమిటంటే అవి అన్ని భారతదేశంలోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం అయి ఉండేవి. ఉదాహరణకు, తిలక్ స్వాతంత్ర్య ఉద్యమం మరాఠా ప్రాంతానికి పరిమితం అయి ఉండేది. మరియు అరబిందో ఘోష్ పోరాటం బెంగాల్‌కు పరిమితం. ఒక గదర్ పోరాటం మాత్రం బెంగాల్ నుండి పంజాబ్ వరకు విస్తరించింది.

మహాత్మా గాంధీ గారి అహింసాయుత పోరాటం

బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్య్ర సంగ్రామం యొక్క అవధులను అఖిల భారత స్థాయికి తీసుకుని వెళ్ళిన ఘనత మహాత్మా గాంధీకి తరువాత నెహ్రూ కు దక్కుతుంది. గాంధీ 1915 లో భారతదేశానికి తిరిగి వచ్చారు. అంతకు ముందు గాంధీ బ్రిటిషు వారి జాతి వివిక్షకు వ్యతిరేకంగా దక్షిణ ఆఫ్రికా లో పోరాడారు. దక్షిణాఫ్రికాలో గాంధీ 21 సంవత్సరాలు నివసించారు. అహింసాయుత సత్యాగ్రహ పద్ధతిలో ఆయన అచట పోరాటం సలిపారు. ఆ సమయంలో ఆయన బ్రిటిషు వారి దమననీతిని అమాసుష అనచివేత  చర్యలను స్వయంగా గమనించారు. మరియు గాంధీ బ్రిటిషు వారు వారి ఆయుధ సంపత్తి ని ఉపయోగించి అధికారం చేలాయించగలుగుతున్నారని, ఆయుధ తయారీలో వారిని అప్పట్లో ఎవరూ అధిగమించలేరని అందుచేత వారికి వ్యతిరేకంగా ఎవరు ఆయుధ పోరాటం చేసినా సఫలీకృతం కాలేరని గ్రహించారు. మరియు గాంధీ గారు స్వతాహాగా అహింసావాది కనుక ఆయన అహింసాయుత సత్యాగ్రహమునకు సహాయ నిరాకరణను జోడించి భారత దేశ స్వాతంత్ర్య పోరాటానికి దిశానిర్దేశాన్ని చేశారు.

నెహ్రూ మరియు ఇతర స్వాతంత్ర్య సమరయోధులు, సామాన్య ప్రజానీకం గాంధీని అనుసరించారు మరియు చివరికి 1950 నాటికి బ్రిటిష్ వారిని శాశ్వతంగా భారతదేశం నుండి బయటకు పారద్రోలారు. అయినాగాని, 1847 మరియు 1947 సవత్సరముల మధ్య, సాయుధ మరియు అహింసాయుత పోరాటాలలో పాలుపంచుకున్న వివిధ దేశ భక్తులయిన  300,000 మంది భారతీయులు, స్వాతంత్ర్య పోరాటంలో అసువులు బాసారు/ప్రాణాలు కోల్పోయారు. ఇపుడు నెహ్రూ గారి చరిత్ర చూద్దాం.

జవహర్‌లాల్ నెహ్రూ 14 నవంబర్ 1889 న మోతీలాల్ నెహ్రూ మరియు స్వరూప తుసు దంపతులకు జన్మించారు. జవహర్ తండ్రి మోతీలాల్ యోక్క జననీ జనకులు గంగాధర్ నెహ్రూ, ఇంద్రాణి మోతీలాల్. మోతీలాల్ 6 మే 1861 న జన్మించారు. గంగాధర్ నెహ్రూ దిల్లి నగరంలోని మొఘుల్ కొలువులో కొత్వాల్ గా పనిచేసేవాడు. 1857 లో తిరుగుబాటు దారులు ముఘుల్ చక్రవర్తిని అయిన బహదూర్ షా ను సామ్రాట్ గా ప్రకటించారు. అయితే బ్రిటిషువారు తిరుగుబాటు చేసిన సిపాయిలను ఓడించి, ముఘల్ వంశం వారినందరినీ ఊచకోత కోశారు. ముఘలు సామ్రాజ్య చిహ్నములన్నిటిని నాశనం చేశారు. ఆసమయంలో నెహ్రూ కుటుంబం తమ సర్వస్వాన్ని కోల్పోయింది. నెహ్రు ఇంటిని బ్రిటిషు వారు తగలబెట్టారు. ప్రతిదీ దోచుకున్నారు. గంగాధర్ నెహ్రూ తన కుటుంబంతో డిల్లి నుండి బయలుదేరి ఆగ్రాకు వెళ్ళిపోయారు, అక్కడ వారి బంధువుల వద్ద ఆశ్రయం పొందారు.

ఈ సమయంలో, మోతీలాల్ యొక్క ఇద్దరు అన్నలు, బన్సిధర్ నెహ్రూ మరియు నందలాల్ నెహ్రూలకు వరుసగా పంతొమ్మిది మరియు పదహారు సంవత్సరాల వయసు గలవారై ఉన్నారు. ఖేత్రికి చెందిన రాజా ఫతే సింగ్ ఆస్థానంలో నందలాల్ గుమస్తాగా ఉద్యోగం ప్రారంభించాడు. ఆ విధంగా అతని తల్లి మరియు సోదరుడికి మద్దతు ఇవ్వడం ప్రారంభించాడు. అలా మోతీలాల్ తన బాల్యాన్ని రాజస్థాన్ లోని ఖేత్రిలో గడిపారు. తరువాత నందలాల్ అచట దివాన్ అయ్యాడు.

తరువాత, నందలాల్ ఖేత్రిని వదిలి ఆగ్రాకు వెళ్లి అక్కడ న్యాయవిద్యను అభ్యసించాడు. ఆ తరువాత ఆగ్రాలోని ప్రావిన్షియల్ హైకోర్టులో లా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు. తదనంతరం, హైకోర్టు అలహాబాద్‌కు మార్చబడింది, ఆపై నెహ్రూ కుటుంబం (మోతీలాల్‌తో సహా) అలహాబాద్‌కు వెళ్లింది. ఆ విధంగా అలహాబాద్‌తో నెహ్రూ కుటుంబ అనుబంధం ప్రారంభమైంది. ఆగ్రా మరియు అలహాబాద్ రెండింటిలోనూ ఆధునిక విద్యను పొందడానికి నందాలాల్ మోతీలాల్‌కు సహాయం చేశారు. మోతీలాల్ కాన్పూర్ నుండి మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి అలహాబాద్ లోని ముయిర్ సెంట్రల్ కాలేజీలో చేరాడు. తరువాత అతను 1883 లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం లో న్యాయవాద వృత్తిని అభ్యసించి “బార్ ఎట్ లా” గా అర్హత సాధించాడు. తరువాత న్యాయవాదిగా భారతీయ కోర్టులలో చేరాడు. ఆ రోజుల్లో సముద్ర ప్రయాణం చేసి విదేశాలకు వెళ్ళడం పాపంగా భావించేవారు. దానికొరకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి శుద్ధి కర్మలు నిర్వర్తించాల్సి ఉండేది. మోతీలాల్ నెహ్రు ఆ తంతులు నిర్వహించడానికి నిరాకరించారు. మరియు జవహర్‌లాల్ లండన్ వెళ్ళి వచ్చినప్పుడు కూడా మోతీలాల్ శుద్దీకరణ కొఱకు తంతులు నిర్వహించలేదు. (గాంధీ తన విదేశీ యానమునకు ప్రాయశ్చిత్తము చేయించుకున్నారు.) కొందరు నెహ్రూలను ముస్లిం అని పిలవడానికి ఈ అంశం ఒక కారణం కావచ్చు.

మోతీలాల్ కాన్పూర్‌లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. మూడు సంవత్సరాల తరువాత, అతను తన సోదరుడు నందలాల్ చేత ఇప్పటికే స్థాపించబడిన లాభదాయకరమైన లాయర్ వృత్తిలో పాల్గొనడానికి అలహాబాద్ వెళ్ళాడు. మరుసటి సంవత్సరం, ఏప్రిల్ 1887 లో, అతని సోదరుడు నలభై రెండు సంవత్సరాల వయస్సులో మరణించాడు, అతని వెనుక ఐదుగురు కుమారులు మరియు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆ విధంగా, 25 సంవత్సరాల వయస్సులో, మోతీలాల్ నెహ్రూ కుటుంబానికి మూలాధారం  అయ్యాడు. తన ప్రాక్టీసు విజయవంతం కావడంతో, 1900 లో, మోతిలాల్ అలహాబాద్‌లో ఒక పెద్ద ఇంటిని కొన్నాడు. అతను దానిని పునర్నిర్మించి ఆ ఇంటికి ఆనంద్ భవన్ అని పేరు పెట్టాడు. జవహర్‌లాల్ ఇక్కడనే జన్మించారు.

జవహర్ స్థానిక పాఠశాలకు వెళ్ళలేదు కాని ఇంట్లోనే  ఫెర్డినాండ్ బ్రూక్స్ మరియు అన్నీ బెసెంట్ అను వారు ఆయనకు విద్యనూ బోధించారు. మరియు జవహర్‌లాల్ నెహ్రు భారతీయ ఉపాధ్యాయుల చెంత ఇంటి వద్దనే హిందీ మరియు సంస్కృతం భాషలు నేర్చుకున్నారు.

1905 లో, జవహర్ ను పాఠశాల విద్య అభ్యసించ డం కొఱకు ఇంగ్లాండు లోని హోవర్ కు  పంపబడ్డాడు. తరువాత నెహ్రూ అక్టోబర్ 1907 లో కేంబ్రిడ్జ్లోని ట్రినిటీ కాలేజీలో చేరాడు అచట 1910 లో నేచురల్ సైన్సెస్ లో ఆనర్స్ డిగ్రీ పొందాడు. ఆ తరువాత నెహ్రూ అక్కడి నుండి లండన్‌కు వెళ్లి ఇన్నర్ టెంపుల్ ఇన్ లో న్యాయవాద విద్యను అభ్యసించాడు. కాబట్టి నెహ్రూ సైన్స్ గ్రాడ్యుయేట్ మరియు న్యాయవాది కూడా.

జవహర్ లాల్ నెహ్రూ మార్చి 1916 లో తమ  పండిట్ ల కులానికి చెందిన కమలా కౌల్‌ను వివాహం చేసుకున్నాడు. అదే సంవత్సరంలో, నెహ్రూ లక్నోలో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వార్షిక సమావేశంలో, మొదటిసారిగా గాంధీగారిని కలిశారు. వయసులో గాంధీ నెహ్రూ కంటే 20 సంవత్సరములు పెద్దవారు. అప్పుడు ఇద్దరూ ఒకరికొకరు అపరిచితులు. అయినాగాని మోతీలాల్, గాంధీ సుపరిచితులు.

కానీ ఆ రోజుల్లో బ్రిటిష్ వారిని భారతదేశం నుండి తరిమికొట్టడం అనే అంశం గురించిన ఆలోచించన చెయ్యడం సామాన్యంగా ఎవరికయినా వింతగా తోచేదని మనం తెలుసుకోవాలి. అప్పట్లో “స్వాతంత్ర్యం  గురించి ఆలోచించడం ఒక పిచ్చిపని” అని గోపాల్ కృష్ణ గోఖలే అనేవారు. దానికి ప్రతిగా రాజ్యాంగ సంస్కరణల కోసం అనగా ప్రభుత్వంలో భారతీయులకు భాగస్వామ్యం కోసం పోరాడాలని గోఖలే చెప్పారు. మోతీలాల్‌ ది కూడా ఇదే అభిప్రాయం. రాజ్యంగా సంస్కరణల కోసం పోరాడడం తప్ప మనకు వేరే ప్రత్యామ్నాయం లేదు అని జవహర్ లాల్ కు మోతీలాల్ చెప్పారు.

అయితే మోతీలాల్ జవహర్ లాల్ లు మహాత్మా గాంధీని కలుసుకునే వరకు వారిద్దరికి కూడా స్వాతంత్ర్య పోరాటం విషయంలో ఇతిమిద్ధమయిన అభిప్రాయం లేదు. బ్రిటీష్ వారికి భయపడకుండా, వారిని ద్వేషించకుండా స్వాతంత్ర్య పోరాటం జరపాలనే ఉద్దేశ్యంలోని విశేష గుణమును నెహ్రు గుర్తించాడు. స్వాతంత్ర్య పోరాటాన్ని గాంధీ నేతృత్వంలో జరిపితేనే మంచిదనే అభిప్రాయానికి నెహ్రు వచ్చాడు. నెహ్రూ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనాలని కోరుకున్నప్పుడు, మోతీలాల్ అతనిని ఎగతాళి చేశాడు. మరియు పోరాటంలో పాలుపంచుకుంటే జైలుకు వెళ్ళడానికి సంసిద్ధమవ్వాల్సి ఉంటుందని హెచ్చరించాడు.  అప్పుడు నెహ్రూ భవిష్యత్తులో జైలు జీవితం గడపడానికి తనను తాను సుషిక్షుతున్ని చేసుకోవడానికి ఇంట్లో నేలపై పడుకోవడం ప్రారంభించాడు.

ALSO READ MY ARTICLES ON

సహాయనిరాకరణ ఉద్యమం

1920 లో మహాత్మా గాంధీ గారి సహాయనిరాకరణ ఉద్యమంలో జవహర్ లాల్ నెహ్రూ పాల్గొన్నారు. యునైటెడ్ ప్రావిన్సెస్ (ఉత్తర ప్రదేశ్) లో జరిగిన ఉద్యమానికి నాయకత్వం వహించారు. అపుడు నెహ్రూను ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల నేరారోపనపై 1921 లో అరెస్టు చేశారు, కొన్ని నెలల తరువాత విడుదల చేశారు. ఆ విధంగా నెహ్రూ 1921 లో మొదటిసారి జైలుకు వెళ్ళాడు. తరువాత 24 సంవత్సరాల కాలంలో, నెహ్రూ ఎనిమిది వేర్వేరు సందర్భాలలో తొమ్మిది సంవత్సరాలకు పైగా జైలు జీవితం గడిపాడు. అతని చివరి జైలు శిక్ష సుమారు మూడు సంవత్సరాలు కొనసాగింది. అతని చివరిసారిగా జైలు నుండి 1945 లో విడుదల అయ్యాడు. జవహర్ కాంగ్రేసు ప్రస్థానంలో తొలిగా 1923 లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా రెండేళ్ళు, 1927 లో మరో రెండేళ్లపాటు పనిచేశారు. 1922 లో చౌరి చౌరా సంఘటన తరువాత గాంధీ ఉద్యమం హింసాత్మకంగా మారడాన్ని నిరస్తిస్తూ ఉద్యమాన్ని అర్ధంతరంగా నిలిపివేశారు.  జవహర్ లాల్ నెహ్రూ మరియు సుభాస్ చంద్ర బోస్ ఇద్దరూ కూడా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని అర్ధంతరంగా విరమించాడాన్ని నిరసించారు.  అయినప్పటికీ, చివరివరకు జవహర్ గాంధీకి విధేయుడిగానే ఉన్నారు. 1923 లో మోతీలాల్ ఇతరులతో చేతులు కలిపి స్వరాజ్ పార్టీని ఏర్పాటు చేశారు. కానీ జవహర్‌లాల్ స్వరాజ్ పార్టీలో చేరలేదు.

బాల గంగాధర తిలక్

ఇప్పుడు తిలక్ చేసిన త్యాగాల గురించి మరోసారి చెప్పుకుందాం. 1897 లో, ఇద్దరు బ్రిటిష్ వారిని చాపెకర్ సోదరులు హత్య చేశారు. కేసరి, మరాఠాలలో తిలక్ రెచ్చగొట్టే రచనలే వారిని హింసా ప్రవృత్తికి కారణమని కోర్టు భావించి తిలక్ కు 18 నెలలు జైలు శిక్ష విధించింది.  తరువాత 1908 లో, బెంగాలీ యువకులు, ప్రఫుల్లా చాకి మరియు ఖుదిరామ్ బోస్ అను విప్హ్లవకారులు  బ్రిటిష్ వారు వెళుతున్న కారుపై బాంబులు విసిరారు. తిలక్ తన కేసరి, మరాఠీ ప్రత్రికలలో విప్లవకారులను సమర్ధిస్తూ వ్యాసాలూ వ్రాశారు. మరియు స్వరాజ్ సాధన కోసం భారతీయులు వెంటనే ఉద్యుక్తమవ్వాలని పిలుపునిచ్చారు. అప్పుడు తిలక్‌పై దేశద్రోహ అభియోగాలు మోపి ఆరు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. 1908 నుండి 1914 వరకు తిలక్ తన శిక్షను రంగూన్ లోని మండలే జైలులో అనుభవించారు. తిలక్ నేరాన్ని అంగీకరించలేదు. మరియు క్షమా బిక్ష కొఱకు అర్జీలు పెట్టుకోలేదు. న్యాయమూర్తి తిలక్ ను తన తరపున చెప్పుకునేదేమయినా ఉన్నదా అని అడిగినప్పుడు, తిలక్ ఇలా అన్నాడు:

“జ్యూరీ తీర్పును వెలువరించినప్పటికీ, నేను నిర్దోషిని అని నేను ఇంకా భావిస్తున్నాను. మానవుల యొక  మరియు దేశాల యొక్క విధిని పైనున్న దైవిక శక్తులు నిర్ణయిస్తాయి.  నేను జైలుకు వెళ్ళడం వలన నేను నడుపుతున్న పత్రికలలో నేను నా యొక్క అభిప్రాయాలను ఇకపై నేను వ్రాయలేక పోవచ్చు. నా జైలు జీవిత సమయంలో నా వాక్ స్వాతంత్ర్యం హరించి బడుతుంది, కానీ నేను జైలులో అనుభ వించబోయే బాధలు కష్టాలు స్వాతంత్ర్య పోరాటానికి ఇప్పటివరకు నేను చేస్తున్న ప్రబోదాలకన్నా, వ్రాతలకన్నా ఎక్కువ స్పూర్తిదాయకమవుతాయని భావిస్తున్నాను.” తిలక్ యొక్క ఈ సందేశం గాంధి, నెహ్రు మరియు తత్కాలీన స్వాతంత్ర్య సమర యోదులపై ఎంతగా పని చేసి ఉంటుందో మనకు తరువాతి ఘటనలను చూస్తె అర్ధమవుతుంది.

లోకమాన్య్త తిలక్ సుదీర్ఘ జైలు శిక్ష అనుభవించిన తరువాత 1914 లో మండలే జైలు నుంచి ఇండియాకు తిరిగి వచ్చారు. (అప్పట్లో రంగూన్ భారతదేశం లో అంతర్భాగంగా ఉండేది.) ఆయన తిరిగి వచ్చిన కొలది కాలంలోనే  స్వాతంత్య్ర సంగ్రామం లో పాలు పంచుకోవడం ప్రారంభించారు.  హోం రూల్ స్వపరిపాలన కొఱకు జాతీయ ఉద్యమం జరపాలని దానికొరకు కాంగ్రెస్ కమిటీ తీర్మానం చెయ్యాలని తిలక్ పట్టుపట్టాడు. కానీ కాంగ్రేసు లోని మితవాదులు దానికి తిరస్కారం తెలిపారు. దానితో తిలక్ స్వయంగా హోమ్ రూల్ లీగ్‌ను స్థాపించాడు. మరియు మరొక హోమ్ రూల్ లీగ్‌ను అన్నీ బెసెంట్ అను ఐర్లాండ్ కు చెందిన వనిత 1916 లో ఇండియాలో ఏర్పాటు చేశారు. నెహ్రూ రెండు లీగ్ లలోను చేరాడు, కానీ అన్నీ బెసెంట్ యొక్క హోమ్ రూల్ లీగ్ లోనే ఎక్కువగా పనిచేశాడు. తిలక్ అనతికాలంలోనే 1920 లో అనారోగ్యంతో మరణించారు. అంతకు ముందు 1915 లో గోపాల కృష్ణ గోఖలే మరణించారు. (ఆ రోజుల్లో కాంగ్రేసులో రెండు గ్రూప్ లు ఉండేవి. గోఖలే మితవాది. తిలక్, లాలా లజపతిరాయ్, బిపిన్ చంద్ర పాల్ మొదలగువారు అతివాదులు. ఈ అతివాదులు స్వరాజ్యం కావాలనేవారు. వీరు సాయుధ పోరాటాన్ని సమర్ధించేవారు. మితవాదులు ప్రభుత్వంలో ప్రాతినిధ్యం కోరేవారు. గాంధి గారు ఆయుధాలు ఉపయోగించకుండా అహింసాయుతమైన పోరాటం చేసి స్వరాజ్యం సంపాదించాలి అనే వారు. వీరి ఆశయం స్వరాజ్య సాధన మాత్రమె. స్వరాజ్యమనగా బ్రిటిషు వారి హయాం లో భారతీయులు స్వంత ప్రరిపాలన చేసుకోవడం మాత్రమె. తరువాత యువ నేతలయిన నెహ్రు బోస్ లు మరొక ముందడుగు వేసి పూర్ణ స్వరాజ్యం కోసం పోరాటం చెయ్యాలనే అంశాన్ని ముందుకు తీసుకుని వచ్చారు. నెహ్రూ అహింసాయుత పోరాటానికి కట్టుబడి ఉన్నాడు. అయితే బోస్ సాయుధ పోరాటాన్ని అవలంబించాలని నిర్ణయించుకుని గాంధి నెహ్రు లకు దూరమయ్యాడు. )

నా ఈ పేజీలు  కూడా చదవండి

1927 లో, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రతినిధిగా, జవహర్ లాల్ నెహ్రూ బెల్జియంలోని బ్రస్సెల్స లో జరిగిన ప్రపంచ వ్యాప్తంగా అణచివేతకు గురౌతున్న వివిధ జాతుల జనుల సమావేశానికి హాజరయ్యారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఒక సాధారణ పోరాటాన్ని సమన్వయం చేయడానికి మరియు ప్రణాళిక చేయడానికి ఈ సమావేశం నిర్వహించబడింది. అక్కడ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నెహ్రూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆఫ్ ది లీగ్‌కు ఎన్నికయ్యారు. అపుడు నెహ్రూ 1926-27 మధ్య కాలంలో యూరప్, సోవియట్ యూనియన్లలో పర్యటించారు. ఈ ప్రయాణం రాజకీయ మరియు ఆర్థిక అంశాలను అవగాహన చేసుకోవడానికి నెహ్రూ కు ఎంతగానో దోహదపడింది.

నెహ్రూ తండ్రి మోతిలాల్ 1928 లో INC అధ్యక్షుడిగా పనిచేశారు. జవహర్‌లాల్ నెహ్రూ 1929 లో తన తండ్రిని అనుసరిస్తూ కాంగ్రేసు  అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

1928 వరకు కాంగ్రెస్ భారతదేశానికి డొమినియన్ హోదా కోసం (ఆస్ట్రేలియా మరియు కెనడా మాదిరిగా) పోరాడుతుండేదని గమనించాలి. అయితే, 1929 వరకు కాంగ్రెస్ పూర్తి స్వాతంత్ర్యం కోసం ఎందుకనీ పోరాటం చెయ్యలేదని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బ్రిటీష్వారికని పారద్రోలితే మరొక యూరోపియన్ శక్తి భారతదేశాన్ని ఆక్రమించే అవకాశం ఉందని భారతీయులకు బాగా తెలుసు. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని భారతీయులు బ్రిటిష్ ఆధిపత్యంతో డొమినియన్ హోదాను కోరడానికి ఇదే కారణం. అయితే మొదటి ప్రపంచ యుద్ధం మరియు రష్యన్ విప్లవం, ఇటలీలో ఫాసిజం యొక్క పెరుగుదల, జపాన్ చేతిలో రష్యా ఓడిపోవడం వంటి సంఘటనలను చూసిన నెహ్రూ మరియు బోస్ వంటి యువ నాయకుల ఉత్ప్రేరణతో , కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ కొఱకు పోరాడడానికి 1929 నాటికి సన్నద్దమయింది.

దేశ స్వాతంత్ర్య ప్రకటన

నెహ్రూ భారత స్వాతంత్ర్య ప్రకటన ముసాయిదాను ఈ క్రింది విధంగా రూపొందించారు:

“ఇతర ప్రజల మాదిరిగానే, స్వేచ్ఛను పొందడం మరియు వారి పని యొక్క ఫలాలను మరియు జీవిత అవసరాలను స్వయంగా ఆస్వాదించడం భారతీయ ప్రజల దైవిక హక్కు అని మనము నమ్ముతున్నాము, తద్వారా వారు అభివృద్ధికి పూర్తి అవకాశాలను పొందాలి. ఏదైనా ప్రభుత్వం ఈ హక్కులను హరించి హింసించినట్లయితే, దానిని మార్చడానికి లేదా రద్దు చేయడానికి ప్రజలకు హక్కు ఉందని మనము నమ్ముతున్నాము. భారతదేశంలోని బ్రిటీష్ ప్రభుత్వం భారతీయ ప్రజల యొక్క స్వేచ్ఛను హరించడమే కాక, ప్రజలను ఆర్థికంగా దోచుకుంటుంది, ఇలా సాంస్కృతికంగా మరియు ఆధ్యాత్మికంగా భారతదేశాన్ని నాశనం చేసింది. అందువల్ల, భారతదేశం బ్రిటిష్ వారితో సంబంధాలను పూర్తిగా తెంచుకుని పూర్ణ స్వరాజ్ సాధించాలని మనము విశ్వాసంతో ముందుకు పయనిద్దాము. ”

1929 లో లాహోర్లోని రవి నది ఒడ్డున ఈ స్వాతంత్ర్య ప్రతిజ్ఞ నెహ్రు గారిచే చదవబడింది. ప్రజలు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని సత్యాగ్రహ పద్ధతిలో నిర్వహించాలని కోరారు. ఈ ఉద్యమానికి నాందిగా గాంధీ ఉప్పు చట్టాలను ఉల్లంఘించారు. గాంధీ తన ప్రసిద్ధ దండి పర్యటనను మార్చి 12 న సబర్మతి నుండి ప్రారంభించి ఏప్రిల్ 5 న దండి చేరుకుని 6 ఏప్రిల్ 1930 న ఉప్పు తయారు చేశారు.

ఈ సుదీర్ఘ పర్యటనలో (240 కి.మీ) వేలాది మంది భారత స్వాతంత్ర్య సమరయోధులు పాల్గొన్నారు మరియు బ్రిటిష్ వారి భారత జాతి సైనికులు ఉద్యమకారులను తీవ్రంగా కొట్టారు. కానీ ఎవరూ ఉద్యమకారులేవారూ కూడా ఆ దమన కాండను ప్రతిఘటించలేదు సరికదా వారు వారికి తగిలిన గాయాలతో క్రింద పడిపోయేవారు. ఇలా ఉప్పు సత్యాగ్రహ సంఘటనల నుండి భారతీయులు ఆయుధాలను ఉపయోగించకుండా బలమైన శత్రువుపై పోరాడగలిగే ఆతమ స్థైర్యాన్ని భారతీయులు  ఒక పాఠంగా నేర్చుకున్నట్లు కనిపిస్తుంది. అలా వందలాది మంది గాయపడ్డారు. భారతదేశం అంతటా ఈ ఉద్యమంలో మిలియన్ల మంది ప్రజలు పాల్గొన్నారు మరియు 60,000 మందిని అరెస్టు అయ్యారు. బ్రిటిష్ వారు చేసిన దారుణాలను సహించి గాంధీజీ అహింస విధాన్ని తాము ఆమోదిస్తున్నామని గాంధికి ఇలా తెలియ జేసారని భావిస్తున్నాను. చౌరి చౌరా ఉదంతం తరువాత గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపివేశారు కదా! మళ్ళి అలా జరగకుండా స్వాతంత్ర్య సమారా యోధులు ఈ సారి జాగ్రత్త వహించారని భావించాలి.

అవిధేయత ఉద్యమంలో భాగంగా, నెహ్రూ ఒక భారీ సమావేశాన్ని ఉద్దేశించి ఒక గొప్ప ఊరేగింపుకు నాయకత్వం వహించారు మరియు అలహాబాద్‌లోని ఉప్పు చట్టాలను ధిక్కరించి ఉప్పు తయారు చేశారు. అపుడు అలహాబాద్ నుండి రాయ్పూర్ రైలులో ప్రయాణిస్తుండగా  1930 ఏప్రిల్ 14 న అతన్ని అరెస్టు చేశారు. ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించినట్లు అభియోగాలు మోపబడి ఆరు నెలల జైలు శిక్ష విధించారు. ఉప్పు సత్యాగ్రహం నిరసనలు ఊపందుకున్నప్పుడు, నెహ్రూ ఇలా ప్రతిస్పందించారు, “ప్రజల స్పందన అకస్మాత్తుగా సంభవించిన వరద లాగా కనిపిస్తుంది”. వాస్తవానికి, సహకారేతర ఉద్యమం భారతీయులను నిరాశ నిస్పృహలనుండి బయటకు లాగి, స్వావలంబన వైపు మళ్ళించింది. భారతీయులకు ఆత్మ స్థైర్యము ప్రసాదించింది.

పౌర హక్కుల తీర్మానం

1929-30లో, నెహ్రూ కాంగ్రెస్ యొక్క ఉద్దేశ్యం మత స్వేచ్ఛ, సంఘాలను ఏర్పరుచుకునే హక్కు, ఆలోచన వ్యక్తీకరణ స్వేచ్ఛ, కులం, రంగు, మతం లేదా మతం అనే తేడా లేని పురసత్వపు హక్కులు రాబోయే స్వాతంత్ర్య భారత దేశంలో కల్పించాబదాలని ఒక తీర్మానాన్ని రూపొందించారు. చట్టం ముందు సమానత్వం, ప్రాంతీయ భాషలు మరియు సంస్కృతుల రక్షణ, రైతులు మరియు కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించడం, అంటరానితనం రద్దు చేయడం, అందరికీ ఓటు హక్కు ఉండాలని సూచించారు.

1931 లో, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షతన పటేల్ ఈ సూచనలన్నింటినీ “ప్రాథమిక హక్కులు మరియు ఆర్థిక విధానం” అను తీర్మానంలో లో స్వీకరించారు.

నెహ్రూ ” సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా ప్రభుత్వం పదవులకు రాజీనామా చేయవలసిన అవసరం మరియు చట్ట సభలలో ప్రాతినిధ్య వ్యర్థమైన రాజకీయమని ఆ సభలను బహిష్కరించాల్సిన అవసరం” గురించి బహిరంగంగా మాట్లాడారు.

జనవరి 1932 లో లండన్లో జరిగిన రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నుండి గాంధీ తిరిగి వచ్చిన వెంటనే, అతన్ని మళ్ళీ జైలుకు పంపారు. అతను మరొక సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించడానికి ప్రయత్నించ వచ్చనే ఆరోపణతో జైలుకు పంపించారు; నెహ్రూను కూడా అరెస్టు చేసి రెండేళ్ల జైలు శిక్ష విధించారు. నెహ్రు గాంధీ ఆద్వర్యంలోని స్వాతంత్ర్య పోరాటం ఎన్నో ఒడిదుడుకులను, బ్రిటిష్ వారి దమన కాండను, స్వజనులనుండి వ్యతిరేకతను ఎదుర్కొంటూ భరిస్తూ కొనసాగింది.

1915 లోనే, భారత బ్యూరోక్రసీ చాలా స్వార్థపూరితమైనదని మరియు జాతీయ ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని గోఖలే వ్యాఖ్యానించారు. తరువాత నెహ్రూ బ్రిటిష్ విధానాలకు మద్దతు ఇండియన్ సివిల్ సర్వీస్‌ మద్దతిస్తుందని ఎద్దేవా చేశాడు. మరియు రాజులు మరియు నవాబులందరూ బ్రిటిష్ వారి పక్షాన ఉండేవారు. మరియు, 1925 తరువాత, హిందూ సంస్థలు మరియు ముస్లిం సంస్థలు స్వాతంత్ర్య పోరాటానికి వ్యతిరేకంగా పనిచేయడం ప్రారంభించాయి. బ్రిటిష్ వారు భారత దేశాన్నివిడిచి వెళ్లిపోయిన తరువాత ప్రజాస్వామ్యం మరియు గణతంత్ర రాజ్య వ్యవస్థ స్థాపనను వీరందరూ వ్యతిరేకించారు. మరొక అంశం ఏమిటంటే స్వాతంత్ర్య పోరాటంలో అంబేద్కర్ గాని, టాగోర్ గాని ఎప్పుడూ పాల్గొనలేదు.  రాబోయే ప్రజాస్వామ్య పద్ధతి వలన మెజారిటీ పాలన వస్తుందని నిమ్న కులాల వారు అపుడు ప్రక్కకు నెట్టబడతారని అందుచేత స్వాతంత్ర్యం బడుగు వర్గాలవారికి ఉపయోగపడదని అంబేత్కర్ అభిప్రాయం.

అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూడటానికి నెహ్రూ 1936 ప్రారంభంలో యూరప్‌లో ఉన్నారు. తరువాత ఆమె స్విట్జర్లాండ్‌లో మరణించింది. ఆ సమయంలో ఒక వేళ (ప్రపంచ) యుద్ధం ప్రారంభ మయితే  ప్రజాస్వామ్య దేశాలకు మాత్రం భారతదేశం సహకరిస్తుందని, అందుచేత బ్రిటన్ మరియు ఫ్రాన్స్‌కు మద్దతుగా భారతదేశం పోరాడగలదని నెహ్రూ చెప్పారు, అయితే భారతదేశం స్వతంత్ర దేశం గా ఆవిర్భవించిన తరువాత మాత్రమే యుద్ధంలో పాల్గొంటుందని ఆయన నొక్కి వక్కాణించారు.

ప్రపంచవ్యాప్తంగా స్వతంత్ర దేశాల ప్రభుత్వాలతో మంచి సంబంధాలు పెంచుకోవడానికి నెహ్రూ సుభాష్ చంద్రబోస్‌తో కలిసి పనిచేశారు. ఏదేమైనా, 1939 ప్రాంతంలో బోస్ స్వాతంత్ర్యం సాధించడానికి ఫాసిస్టుల యొక్క (ఇటాలియన్ మరియు జర్మన్లు) సహాయం పొందడం మంచిదని వాదించి నెహ్రు గాంధి లతో విభేదించాడు. ఆ సమయంలో, స్పెయిన్లో అంతర్గత యుద్ధంలో ఫ్రాన్సిస్కో ఫ్రాంకో సైన్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్న రిపబ్లికన్లకు నెహ్రూ మద్దతు పలికారు. నెహ్రూ వి.కె.కృష్ణ మీనన్‌తో కలిసి స్పెయిన్‌ను సందర్శించి రిపబ్లికన్లకు మద్దతు ప్రకటించారు. ఆ సమయంలో ఇటలీ నియంత బెనిటో ముస్సోలినీ నెహ్రూను కలవాలనే కోరికను వ్యక్తం చేసినప్పటికీ, నెహ్రూ నిరాకరించారు.

ఈలోగా 1937 లో ప్రాంతీయ ప్రభుత్వాలకు ఎన్నికలు జరిగాయి. 1936 లక్నో సెషన్‌లో, భారత ప్రభుత్వ చట్టం 1935 ను సరించి 1937 లో జరగబోయే ప్రాంతీయ (Provincial) ఎన్నికలలో పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ అంగీకరించింది. ప్రజలు శాసనసభలలో పాల్గొనడం ద్వారా బిటిష్ వారి అధికారాన్ని తుడిచిపెట్టవచ్చు అని కొందరు కాంగ్రెస్ పార్టీ వారు వాదించారు. మొదట నెహ్రూ ఈ వాదనను వ్యతిరేకించారు, కాని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహించడానికి అంగీకరించారు.

ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీని చాలా ప్రావిన్సులలో అధికారంలోకి తెచ్చాయి. నెహ్రూకు ఆదరణ పెరిగింది. ఇది ప్రావిన్సులలో స్వయంప్రతిపత్త ప్రభుత్వాలకు నాందిగా భావించవచ్చు. అలాగే ఈ ప్రభుత్వాల ఏర్పాటు భారతదేశ సమాఖ్య వ్యవస్థకు నాంది పలికింది.  ప్రజలు హిందూ మహాసభ మరియు ముస్లిం లీగ్లను తిరస్కరించారు. ఈ ఎలక్షన్ల లో నెహ్రు ఆద్వర్యం లోని కాంగ్రెసును ఎన్నుకోవడం ద్వారా భారతీయులు నెహ్రూ ప్రతిపాదిస్తున్న ప్రజాస్వామ్య సూత్రాలకు, మానవ హక్కులకు, మరియు గణతంత్ర రాజ్య వ్యవస్తాపనకు  ప్రజలు ఆమోదం పలికినట్లు అయింది.

1939 లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైన చైనా పర్యటనలో ఉన్న నెహ్రూ వెంటనే ఇండియా తిరిగి వచ్చారు. అపుడు నెహ్రు ఇలా ప్రకటించారు “ప్రజాస్వామ్యం మరియు ఫాసిజం మధ్య పోరాటంలో, మా సానుభూతి తప్పనిసరిగా ప్రజాస్వామ్యానికి అనుకూలంగా ఉంటుంది”.