శాతవాహనులు

అంధ్ర శాతవాహనులు: …..పై పారాలలో కాకుత్ స్థుల వంశము గురుంచి చెప్పుకున్నాము. కాని కాకుత్ స్థులకు ముందు ఎవరు రాజ్యమేలారు? కాకుత్ స్థులు ఎప్పుడు వచ్చారు. ఈ ప్రశ్నలకు సమాధానము సుదాసు యుద్ధములను విచారిస్తే తెలుస్తుంది. సుదాసును వశిష్ట మునులవారు ఇంద్రునిగా నియమించారు. ( సుదాసు ముందు దేవదాసు ఉన్నాడు. సుదాసు తరువాత రఘువు, దిలీపుడు, దశరధుడు మొదలయిన వారు ఉన్నారు. )

(ఈ పేజీలోని అంశములు నేను వ్రాసిన్ “ప్రాచీన భారతీయులకు అక్షర సుమాంజలి” అను గ్రంధములోని “అపరాజితము” అను అధ్యాయము, 16  లోనివి.)

అప్పటివరకు రాజ్యము చేస్తున్న ఇంద్రుడు చివరకు ప్రస్తుత ఇంద్ర ప్రస్థమునకు వెళ్ళిపోయాడు. అంటే అంతకు ముందు అయోధ్య పేరు అమరావతి అయి ఉండాలి. దేవతలకు రాజు ఇంద్రుడు. అతని రాజధాని అమరావతి. ఈ ప్రాంతము కోసలగా మారక మునుపు ఇది ఇంద్రలోకము అదియే దేవ లోకమయి ఉంటుంది. 
ఇంద్రుడు ఇన్ద్రప్రస్థమునకు మారిన తరువాh కొంత కాలమునకు ప్రస్తుత మహారాష్ట్రలోని అమరావతికి తరువాత అక్కడినుంచి తీర ఆంధ్ర లోని అమరావతికి వలస వెళ్ళి ఉంటాడు.

ALSO READ MY ARTICLES ON

శాతవాహనులు:

    జాతక కథలలో బోధిసత్వుని శర్థవహ  అని అంటారని తెలుసుకున్నాము కదా! ఈ శార్థావహ పేరకు శాతవాహన పేరుకు పద సారూప్యత చాలా దగ్గరగా ఉంది. ఈ శార్దావాహులు కోసల నుంచి వ్యాపారము కొఱకు బయలు దేరి విదేశములు యాత్రలు చేసే జనులు. వీరి వంశముల వారే కాలక్రమేణా ప్రస్తుత మహారాష్ట్రకు తరువాత కోస్తా ఆంధ్రకు విస్తరించిన ఆంధ్రులయినా ఆశ్చర్యపోనక్ఖరలేదు.

Book “ప్రాచీన భారతీయులకు అక్షర సుమాంజలి (వేద కాల సమాజము)”
Book “ప్రాచీన భారతీయులకు అక్షర సుమాంజలి (వేద కాల సమాజము)”

నా ఈ పుస్తకమును చదువదలచిన వారు నా సెల్ ఫోన్ నంబర్ 9866357268 కు Phone Pay ఫోన్ పె ద్వారా రు. 450/- పంపించి పోస్టల్ అడ్రసు తెలియ జేస్తూ వాట్మెసాప్ మెసేజ్ పెడితే పోస్ట్ ద్వారా పుస్తకము పంపబడును.

లేదా

పుస్తకమును Amazon అమెజాన్ ద్వారా కొనుగోలు చేయుటకు ఈ లింకు పై క్లిక్ చెయ్యండి. https://www.amazon.in/dp/B0CTSP19X3?ref=myi_title_dp అమెజాన్ ద్వారా వెల రు. 450/-

విశ్వామిత్రునికి ఆంధ్రులకు అవినాభావ సంబంధము ​కలదు. విశ్వామిత్రుడు కుశ పుత్రుడు. కుశ ధ్వజుల కుశ నాభుల రాజ్యములు పూర్వపు మత్స్యదేశమునకు సరిహద్దు రాజ్యములు. ఈ కుశనాభుల వంశము కూడా ఇక్షుమతీ తీరములోనె మొదలయినది. మలి శాతవాహనులలో ఇక్ష్వాకులు కూడా ఉన్నారు.  త్రిపురములకు అంబలు ముగ్గురు స్థలదేవీలు. వీరిముగ్గురుని కలిపి త్రి అంబలు లేక త్రయంబలు అంటారు.

  ఈ ముగ్గురు అంబలను తన భక్తితో కైవశము చేసుకుని ఉండే వాడు త్రయంబకేశ్వరుడు. ప్రస్తుతము మహారాష్ట్రలోని నాసిక్ వద్ద త్రయంబకేశ్వరాలయము ఉంది. సర్దవహులు అంటే కోసల రాజ్యవాసులు అని ముందు చెప్పుకున్నాము. ​రాముని తరువాత రాజ్యమేలిన సగరుడు, దిలీపుదు పలు అశ్వమేధయాగములు నిర్వర్తించాడని వారు గొప్ప సామ్రాజ్యమును స్థాపించారని చరిత్ర చెబుతుంది. ​

నా ఈ పేజీలు  కూడా చదవండి

అలా సార్ధావహులు త్రిపురములను ఏలారు అని అర్ధమవుతుంది. త్రిపురలను ఏలినవారు త్రయంబకేశ్వరుని అరాధిస్తారుకదా! అలాగే దక్షిణ భారతదేశములో శాతవాహనుల తొలి మజిలీ మహారష్ట్ర అని చరిత్రకారులు చెబుతున్నారు. అలా చూస్తే సర్దవహలు లేక శాతవాహనులు త్రయంబకేశ్వరాలయమును స్థాపించారని నమ్మడానికి ఆస్కారము ఉంది.

    ముందు జరిపిన చర్చకు సారాంశము ఈ విధముగా చెప్పవచ్చు. ప్రస్తుత రావి నదియే పూర్వపు పురుష్ణి, అదియే సరుయునది. ప్రాచీనకాలములో సరయూ  సదియొడ్డున విలసిల్లిన అయోధ్యనగరమే ప్రస్తుత హరప్పా పట్టణము. ఇచ్చట నివసించిన వివిధజనులు తరువాతికాలములో భారతదేశములోని ప్రధాన భూభాగమునకు వలసలు వెళ్ళిపోయారు.

అలా వలసలు వచ్చినవారిలో త్రయంబకేశ్వరుని తమతో తెచ్చుకున్న త్రిలింగులు లేక తెలుగువారు ప్రముఖులు. వీరినే బౌద్ధరచనలు సార్ధవాహులు అన్నారు. (చిత్రము 16.1).పురాణములు ఆంధ్రులు అన్నాయి. మరోశాఖ ప్రస్తుతము ఉత్తరభారతదేశములోని సరయునదివద్ద ఆవాసములు ఏర్పరచుకున్నారు. వీరే దక్షిణ ఆసియాలోని బాలి, ఇండోనేషియా ధాయ్ ల్యాండ్ తదితర ప్రాంతములలో హైందవమును వ్యాప్తిచేశారు. (చిత్రము 16.2)

నా వీడియోలను యుట్యుబ్ లో తిలకించండి

నా ఈ వ్యాసాలను కూడా చదవండి